రోగులను ఆస్పత్రికి తరలించాల్సిన అంబులెన్స్ లో చేపలను తరలిస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ తంతు ఎట్టకేలకు బయటపడింది. డ్రైవర్ ను పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో అంబులెన్స్‌లలో రోగులకు బదులు కొందరు చేపలను తీసుకెళ్తున్నారు. అక్రమంగా చేపలు తీసుకెళ్తున్న క్రమంలో సోషల్ మీడియాకి పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
జలౌన్‌లోని రాంపుర పోలీస్ స్టేషన్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంబులెన్స్ లో మూడు బస్తాల నిండాలు చేపలు కనిపించాయి. రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్ చేపలను తీసుకెళ్తుండడంతో అక్కడ వాకింగ్ చేసే వారికి అనుమానం వచ్చింది. అంబులెన్స్ ను ఆపి డ్రైవర్ ను ప్రశ్నించారు. సదరు డ్రైవర్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అంబులెన్స్ లోపల చెక్ చేయడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు.
https://twitter.com/i/status/1730486360195371429
👉 – Please join our whatsapp channel here –