సాఫీగా సాగిపోతున్న జీవితం లో ఊహించనీ ఘటనలు కొన్ని కొన్ని సార్లు జీవితాన్ని మొత్తం తలకిందులు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది విషయం లో అయితే విధి ఏకంగా కక్ష కట్టినట్టుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. సంతోషం గా ఉన్న జీవితం లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది ఇక దిక్కుతోచని పరిస్థితికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఈ క్రమం లోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూలల్లో జరిగిన అన్ని ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి.
ఇలాంటి ఘటనలలో కొన్ని ఏకంగా ప్రతి ఒక్కరు మనసును కదిలిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు కూతుర్లు తల్లి చాటు బిడ్డలు గానే పెరిగారు. అయితే తండ్రి కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా భార్యాబిడ్డలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో ఏకంగా తల్లి కి ఎంతో కష్టపడి అటు కూతుర్ల ఆలనా పాలన చూస్తూ వచ్చింది. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ ఆ కుటుంబం జీవిస్తుంది. కానీ వీరిపై విధి కక్ష కట్టినట్లుగానే వ్యవహరించింది. ఏకంగా తల్లిని మృత్యు ఒడిలోకి చేర్చింది.
దీంతో దాదాపు ఏడాది పాటు తల్లి మృతదేహంతోనే ఆ కూతుర్లు ఉండిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. వారణాసిలో పల్లవి 27, వైష్పిక్ 18 తల్లి 2022 డిసెంబర్లో మరణించారు అయితే అప్పటికే తండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోగా.. తల్లికి వాళ్లు అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు. శవాన్ని ఇంట్లోనే ఉంచి జీవనం సాగించారు. ఇటీవల దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇంట్లోకి వెళ్లిన పోలీసులు కుల్లిపోయిన శవం ఆ పక్కనే ఇద్దరు పిల్లలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.
👉 – Please join our whatsapp channel here –