తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వడ్డీ కాసుల వాడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్‌మెంట్లు (Compartment) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 66,162 మంది భక్తులు దర్శించుకోగా 27,668 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చిందని తెలిపారు.
డిసెంబర్ 11న వైజాగ్ లో కార్తిక దీపోత్సవం
కార్తిక మాసం సందర్భంగా డిసెంబర్ 11న వైజాగ్ లో దాతల సహకారంతో కార్తిక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. కార్తిక దీపోత్సవంలో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన రికార్డింగ్ పనుల కోసం ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ సహకారం తీసుకోవాలని సూచించారు. ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని సూచించారు.
👉 – Please join our whatsapp channel here –