DailyDose

రోడ్ మీద గోడగా మారిన రెండిళ్ల మధ్య గొడవ

రోడ్ మీద గోడగా మారిన రెండిళ్ల మధ్య గొడవ

పల్నాడు జిల్లా(Palnadu) శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ఓ ఇంటి యజమాని ఎదురింటి వారితో గొడవపడి నడిరోడ్డుపై గోడ నిర్మించారు. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్‌కు చెందిన ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. వీరిళ్ల మధ్యలో సీసీ రోడ్డు ఉంది. లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా గతంలో మెట్లు కట్టాడని చంద్రశేఖర్‌ అభ్యంతరం తెలిపారు. అప్పట్లో గ్రామపెద్దలు, పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఇద్దరికీ రాజీ కుదిర్చారు. చంద్రశేఖర్‌ ఇటీవల తన ఇంటి ఎదుట మురుగు కాలువపై మెట్లు కట్టారు. దీనికి నిరసనగా లక్ష్మీనారాయణ ఏకంగా ఇంటి ముందున్న రోడ్డు మధ్యలో సిమెంటు ఇటుకలతో గోడ నిర్మించారు. దీనిపై పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని చంద్రశేఖర్‌ వాపోయారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z