తెలంగాణ దంగల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. మరికాసేపట్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడనున్నాయి. ఉదయం 10గంటల వరకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోపాటు.. రెండు రౌండ్ల వరకు కౌంటింగ్ జరిగింది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో ముందంజలో ఉండగా.. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో ముందంజలో కొనసాగుతున్నాయి. చాలామంది ప్రముఖ నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఆధిక్యంలో ఎవరెన్ని స్థానాల్లో ఉన్నారంటే..
బీఆర్ఎస్ 47 కాంగ్రెస్ – 61 బీజేపీ- 6 ఎంఐఎం -4
👉 – Please join our whatsapp channel here –