Business

సంక్రాతికి ఏపీ వెళ్లే వారికి చేదువార్త!

సంక్రాతికి ఏపీ వెళ్లే వారికి  చేదువార్త!

సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్‌ భారీగా ఉంది. పండగకి సుమారు నెలన్నర ముందే వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లో ఉంది. కొన్ని రైళ్లకు రిగ్రెట్‌ వస్తోంది.హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులు వేల సంఖ్యలో ఉండడం.. వారిలో చాలామంది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు రిజర్వేషన్‌ చేయించుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జనవరి 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఉన్నాయి. 11, 12, 13 తేదీల్లో నడిచే రైళ్లు ఇప్పటికే నిండిపోగా, అనేకమంది ప్రయాణ సమయానికి కన్ఫర్మ్‌ అవుతుందనే ఆశతో బుకింగ్‌ చేసుకుంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z