Politics

పోస్టల్‌ బ్యాలెట్లలో చాలా చోట్ల ముందంజలో ఉన్న కాంగ్రెస్‌

పోస్టల్‌ బ్యాలెట్లలో చాలా చోట్ల ముందంజలో ఉన్న కాంగ్రెస్‌

తెలంగాణ వ్యాప్తంగా (2023 telangana legislative assembly election results) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పోస్టల్‌ బ్యాలెట్లలో పలు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భాజపా, సీపీఎం, ఎంఐఎం అభ్యర్థులకు ఒక్కోచోట ఆధిక్యం లభించింది.

పోస్టల్‌ బ్యాలెట్లలో ఆధిక్యం లభించిన కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), భట్టి విక్రమార్క (మధిర) రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), నాగరాజు (వర్ధన్నపేట), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్గొండ), వినోద్‌ (బెల్లంపల్లి), రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), ప్రేమ్‌సాగర్‌ (మంచిర్యాల) ఉన్నారు. కామారెడ్డిలో భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి, చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆధిర్యంలో కొనసాగుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z