నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Assembly Election Results) ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం.. పెద్ద సంఖ్యలో ఎన్నికల సంఘం (EC) వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈసీ వెబ్‌సైట్‌పై లోడ్ పడింది. దానివల్ల వెబ్‌సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. తమకు వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని పోస్టులు పెడుతున్నారు. దాంతో ఫలితాల ప్రారంభ సరళి వెంటనే తెలియడం లేదని చెప్తున్నారు. ఈ పోస్టులు ఎన్నికల సంఘం దృష్టికి చేరాయి. ఈ సమస్యను ఈసీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
👉 – Please join our whatsapp channel here –