Politics

మూడో స్థానానికి పడిపోయిన కేసీఆర్

మూడో స్థానానికి పడిపోయిన కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు శరవేగంగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ దూసుకుపోతోంది. కారుకు బ్రేకులు పడుతున్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే.. కామారెడ్డిలో నాలుగు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొలి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. రెండవ స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోవడం షాకింగ్‌గా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z