Politics

మా నాన్న ఎప్పుడూ నా హీరోనే

మా నాన్న ఎప్పుడూ నా హీరోనే

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు నిరాశ కలిగించాయి. మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆశలపై నీళ్లు చల్లాయి. హస్తం పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో రేపు మధ్యాహ్నానికి తేలనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు జిల్లా కార్యాలయాల్లో సంబరాలు, ఉత్సాహ వాతావరణం కనిపించలేదు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని, తాము అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ను హీరో అని అభివర్ణించారు. నా హీరో అంటూ కేసీఆర్‌తో ఓ చిన్న వీడియో క్లిప్‌ని కవిత షేర్ చేశారు. రచయితగా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ చెప్పిన డైలాగ్స్‌తో కేసీఆర్ నడుస్తూ వస్తున్న వీడియోను కవిత పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z