Business

140కి పైగా ట్రైన్స్ రద్దు!

140కి పైగా ట్రైన్స్ రద్దు!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌. మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 140కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) బలపడనుంది. దీనికి మిచౌంగ్‌ తుపానుగా నామకరణం చేశారు. తుపాను ప్రభావంతో ఆది, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో డిసెంబర్‌ 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఆ జాబితా ఇదీ..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z