పొగ మంచు కమ్మేయడంతో దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. విజిబిలిటీ తగ్గిపోవడంతో శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న 20 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు.
ఢిల్లీ నుంచి లక్నో, జైపూర్, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రన్‌వే పైనే నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
👉 – Please join our whatsapp channel here –