Devotional

శిరిడీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కీలక నిర్ణయం

శిరిడీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కీలక నిర్ణయం

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిరిడీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు సమర్పించే బంగారం, వెండి కానుకలను కరిగించి పతకాలు, నాణేలుగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సుమారు 450 కిలోల బంగారం, 6 వేల కిలోల వెండిని భక్తులు కానుకలుగా హుండీల్లో వేసినట్లు అంచనా. భారీగా నిల్వ ఉన్న ఈ కానుకలను కరిగించి 5, 10 గ్రాముల నాణేలు, పతకాలను తయారుచేయాలని ప్రభుత్వ అనుమతి కోరినట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z