హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం 15 ప్రాంతాల్లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు, ప్రజలు తదనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అదనపు కమిషనర్ జీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద పార్కింగ్ ప్రాంతాలు ఇవీ..
నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ (పార్కింగ్ ఏరియా)
* ముషీరాబాద్ ఏవీ కాలేజీ, దోమల్‌గూడ (భారత్ స్కౌంట్స్ అండ్ స్కూల్, ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ, దోమలగూడ)
* చాంద్రాయణగుట్ట నిజాం కాలేజీ (నిజాం కాలేజీ గ్రౌండ్నం–4, గేట్ నం–2)
* అంబర్‌పేట రెడ్డి కాలేజీ (వైఎంసీఏ గ్రౌండ్స్, శాంతి థియేటర్, నారాయణగూడ)
* మలక్‌పేట జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియం,అంబర్‌పేట (ఎంసీహెచ్ అంబర్‌పేట)
* సనత్‌నగర్ ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ (ఎంబీఏ కాలేజ్ ఓపెన్ ప్లేస్)
* సికింద్రాబాద్ పీజీ రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (సైక్లింగ్ వెల్డ్రౌన్ గ్రౌండ్)
* గోషామహల్ కోటి ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్
* చార్మినార్ కమల నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్)
* యాకుత్‌పుర సరోజినినాయుడు వనితా మహా విద్యాలయ (భీమ్‌సింగ్ రామ్ బడా పార్కింగ్)
* కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, మాసబ్‌ట్యాంక్ (కాలేజ్ వెనక లైన్)
* నాంపల్లి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాసబ్‌ట్యాంక్ (హాకీ గ్రౌండ్ )
* బహదూర్‌పుర ఆరోరా లీగల్ సైన్స్ అకాడమీ (అరోరా కాలేజ్)
* ఖైరతాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం (బెటాలియన్ ఓపెన్ గ్రౌండ్స్)
* జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ సీఎస్ఐఐటీ, వెస్టీ కాలేజ్ (వెస్టీ కాలేజ్)
👉 – Please join our whatsapp channel here –