తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబరుపేటలో బీజేపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. అంబరుపేట బీజేపీ అభ్యర్థిగా కృష్ణాయాదవ్‌కు అవకాశం ఇచ్చారు. ఆయనను గెలిపించే బాధ్యతను బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డికి అప్పగించింది. కృష్ణాయాదవ్‌ను గెలిపించుకోవటంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారు.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు.. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సాధించే సీట్లు ఎన్ని అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.
👉 – Please join our whatsapp channel here –