తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అంజనీ కుమార్ వెంట మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ చెప్పారు. రేవంత్ కు భద్రత కల్పించే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
మరో వైపు తెలంగాణలో హస్తం జోరు కొనసాగుతోంది. అత్యధిక సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ సీట్లను దాటేసింది . దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు జూబ్లీహిల్స్ లోని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులుకూడా భారీగా మోహరించారు.
👉 – Please join our whatsapp channel here –