Politics

అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టబోతున్న వైద్యులు

అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టబోతున్న వైద్యులు

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏకంగా 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. వీరిలో అత్యధికులు తొలిసారి గెలిచినవారే. అందులో యువతే ఎక్కువ ఉన్నారు. ఇంత ఎంత మొత్తంలో డాక్టర్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. వీరే కాకుండా టీచర్లు, అడ్వకేట్లు, ఇంజినీర్లు సైతం ఎమ్మెల్యేలుగా గెలిచారు.

ఇంజినీర్లు, విద్యాసంస్థల అధినేతలు
ఇంజినీర్లు, విద్యాసంస్థల అధినేతలు సైతం ఈ ఎన్నికల్లో గెలిచారు. గంగుల కమలాకర్‌, కేపీ వివేకానంద్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, యశస్వినిరెడ్డి ఇంజినీర్లు కాగా, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. వెడ్మా బొజ్జు (ప్రభుత్వ ఉద్యోగి), జారే ఆదినారాయణ (పీఈటీ), లక్ష్మీకాంతారావు (మాజీ యాంకర్‌), కే మాణిక్‌రావు (ఆర్టీవో) పని చేసి తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక విద్యాసంస్థల అధినేతలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం విజయబావుటా ఎగురవేశారు. ఐటీ కంపెనీ అధినేత మదన్‌మోహన్‌, రంజీ క్రికెటర్‌ పాడి కౌశిక్‌రెడ్డి సైతం విజయంసాధించారు. అడ్వకేట్లు కాలేరు వెంకటేశ్‌, జగదీశ్‌రెడ్డి సైతం ఘన విజయంసాధించారు.

ఎమ్మెల్యేలు అయిన డాక్టర్లు వీరే

* డాక్టర్‌ రామచంద్రునాయక్‌ (ఎంఎస్‌ సర్జన్‌), డోర్నకల్‌
* డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ (ఎంఎస్‌ సర్జన్‌), అచ్చంపేట
* డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు (ఎంఎస్‌ ఆర్థో), సిర్పూర్‌
* డాక్టర్‌ మురళీనాయక్‌ (ఎంఎస్‌ సర్జన్‌), మహబూబాబాద్‌
* డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ (ఎంఎస్‌ సర్జన్‌), మానకొండూరు
* డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి (ఎండీ రేడియాలజీ), నారాయణపేట
* డాక్టర్‌ పటోళ్ల సంజీవరెడ్డి (పీడియాట్రిషన్‌), నారాయణఖేడ్‌
* డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌ (ఎంబీబీఎస్‌), మెదక్‌
* డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ (కంటి డాక్టర్‌), జగిత్యాల
* డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ (న్యూరోస్పైన్‌ సర్జన్‌), కోరుట్ల
* డాక్టర్‌ గడ్డం వివేక్‌ వెంకట్‌స్వామి (ఎంబీబీఎస్‌), చెన్నూరు
* డాక్టర్‌ తెల్లం వెంట్రావు (ఆర్థో), భద్రాచలం
* డాక్టర్‌ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి (డెంటల్‌), నాగర్‌కర్నూల్‌
* డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి (పిడియాట్రిషన్‌), నిజామాబాద్‌ రూరల్‌
* డాక్టర్‌ మట్టా రాగమయి (పల్మనాలజిస్ట్‌), సత్తుపల్లి

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z