హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ (Congress) దూసుకెళ్తోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను కనపబరుస్తున్నారు.
ఇప్పటి వరకు 71 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ కేవలం 34 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓడిపోయే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే ఈరోజు (ఆదివారం) సాయంత్రం గవర్నర్కు కేసీఆర్ రాజీనామా లేఖను పంపనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అభ్యర్థులు వెనుకంజలో ఉండటంతో ప్రగతి భవన్ బోసిపోయింది. ప్రగతిభవన్ వద్ద పెద్దగా హడావిడి కనిపించని పరిస్థితి.
👉 – Please join our whatsapp channel here –