తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రెండు సార్లు అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదలు తెలిపారు. అయితే, ఇవాళ వెలువడిన ఫలితాలు తమను ఏమీ బాధించలేదన్నారు. కానీ అనుకున్న రీతిలో ఫలితం రాకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. తాజా ఫలితాలను ఓ పాఠంగా తీసుకొని మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –