తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో 119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది.
ఉమ్మడి మెదక్ లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారో చూద్దాం:
* మెదక్: కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రెడ్డి విజయం
* సిద్దిపేట: బీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్ రావు విజయం
* గజ్వేల్: కేసీఆర్ విజయం
* దుబ్బాక: బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం
* సంగారెడ్డి: బీఆర్‌ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ విజయం
* పటాన్ చెరు: ఫలితంపై కొనసాగుతున్న ఉత్కంఠ
* నర్సాపూర్: బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి విజయం
* నారాయణఖేడ్: కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ విజయం
* ఎల్లారెడ్డి: కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ విజయం
* జహీరాబాద్: బీఆర్‌ఎస్ అభ్యర్థి కొనింటి మానిక్ రావు విజయం
* అందోల్: కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ విజయం
* హుస్నాబాద్: కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విజయం
👉 – Please join our whatsapp channel here –