Business

మారుతి సుజుకి జిమ్నీ నుండి కొత్త ఎడిషన్ లాంచ్-వాణిజ్య వార్తలు

మారుతి సుజుకి జిమ్నీ నుండి కొత్త ఎడిషన్ లాంచ్-వాణిజ్య వార్తలు

మారుతి సుజుకి జిమ్నీ నుండి కొత్త ఎడిషన్ లాంచ్

భారతదేశంమారుతి సుజుకి జిమ్నీ నుండి కొత్త ఎడిషన్ లాంచ్లో మారుతీ సుజుకీ కార్లకు ఉన్న క్రేజ్‌ వేరు. మధ్యతరగతి వారికి అనువైన కార్లను రిలీజ్‌ చేస్తూ మారుతీ సుజుకీ కంపెనీ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇటీవల కాలంలో యువతను కూడా ఆకట్టుకునేలా మారుతీ సుజుకీ నయా కార్లను రిలీజ్‌ చేస్తుంది. ఈ కార్లల్లో జిమ్నీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్‌ లాంగ్‌ ట్రిప్స్‌కు వెళ్లాలనుకునే వాళ్లు ఈ కారును అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ జిమ్నీ కార్లను అత్యధిక స్థాయిలో అందుబాటులో ఉంచుతుంది. ఈ నేపథ్యంలో జిమ్నీ కారుకు సరసమైన అప్‌డేట్‌ వెర్షన్‌గా థండర్‌ను లాంచ్‌ చేసింది. మారుతీ రిలీజ్‌ చేసిన జిమ్నీ థండర్‌ వెర్షన్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.మారుతీ సుజుకీ జిమ్నీ థండర్‌ వెర్షన్‌ ధర రూ.10.74 లక్షల నుంచి రూ.14.05 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు ధరను స్టాండర్డ్‌ జిమ్నీ వెర్షన్‌తో పోలిస్తే రూ.2 లక్షల తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఎస్‌యూవీ ప్రత్యేక ఎడిషన్‌ జీటా, ఆల్ఫా వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ కారు స్టైలిష్‌ లుక్‌తో తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాటు ఈ కారు పవర్‌ ట్రెయిన్‌ ప్రకారం ఎలాంటి మార్పులు లేవు.మారుతీ సుజుకీ థండర్‌ ఎడిషన్‌  1.5 లీటర్‌, 4 సిలిండర్‌, కే సిరీస్‌ ఇంజిన్‌తో అందిస్తుంది. ఈ ఇంజిన్‌ 103 బీహెచ్‌పీ శక్తిని,134 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి 4-స్పీడ్‌ టార్క్‌ కన్వెర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికతో 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ను ఉపయోగిస్తుంది. మారుతీ సుజుకీ జిమ్నీ ముఖ్యంగా ఆఫ్‌రోడిండ్‌ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది.

భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో భారతి టెలికాం  ప్రత్యక్ష వాటా

భారతీ ఎయిర్‌‌టెల్​లో  ప్రమోటర్ సంస్థ అయిన భారతి టెలికాం  అదనంగా 1.35 శాతం వాటాను రూ. 8,301 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా కొనుగోలు చేసింది. దీనితో, భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో భారతి టెలికాం  ప్రత్యక్ష వాటా 38.35 శాతం వాటా నుంచి 39.7 శాతానికి చేరుకుంటుంది. సునీల్ భారతి మిట్టల్ కుటుంబం  సింగపూర్‌‌కు చెందిన సింగ్‌‌టెల్ సహ-యాజమాన్యం కలిగిన భారతి టెలికాం సెప్టెంబర్ 30 నాటికి భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో 38.35 శాతం వాటాను కలిగి ఉంది.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌లో బ్లాక్ డీల్ మెకానిజం ద్వారా ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌‌మెంట్ లిమిటెడ్  నుంచి భారతీ టెలికాం లిమిటెడ్  భారతీ ఎయిర్‌‌టెల్ లిమిటెడ్  1.35 శాతం షేర్లను మొత్తం రూ. 8,301.73 కోట్లకు కొనుగోలు చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో 5.93 శాతం వాటాను కలిగి ఉన్న ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌‌మెంట్ లిమిటెడ్ నుంచి కంపెనీ వాటాను పొందింది. సింగపూర్‌‌కు చెందిన సింగ్‌‌టెల్ భారతీ టెలికాంలో 50.56 శాతం వాటాను కలిగి ఉంది  సెప్టెంబర్ 30, 2022 నాటికి మిట్టల్ కుటుంబానికి 49.44 శాతం వాటా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో అందుబాటులో ఉన్న బ్లాక్ డీల్ డేటా ప్రకారం భారతి టెలికాం 8.11 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఇది భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో 1.35 శాతం వాటాకు సమానం.

చైనా వద్దు భారత్ ముద్దు

అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద రిటైల్ స్టోర్స్ చైన్ కలిగి ఉన్న ‘వాల్‌మార్ట్’ (Walmart) గత కొంత కాలంగా భారతీయ మార్కెట్ మీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సుమారు నాలుగింట ఒక వంతు దిగుమతులను ఇండియా నుంచి స్వీకరిస్తున్న కంపెనీ, చైనా దిగుమతులను తగ్గించడానికి అన్ని విధాలా తయారవుతోంది.నిజానికి వాల్‌మార్ట్‌కు అతి పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనా నుంచి కంపెనీ దిగుమతులను ప్రతి ఏటా తగ్గిస్తూనే ఉంది. 2018లో 80 శాతం దిగుమతులు చేసుకున్న సంస్థ.. 2023 నాటికి 60 శాతం మాత్రమే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.ఏ ఒక్క సరఫరాదారు ఒక దేశం మీద ఆధారపడి పనిచేసే అవకాశం లేదు, భారత ఆర్థిక దృక్పథం, సానుకూల మార్కెట్ సూచికలు, తక్కువ ధర తయారీ సామర్థ్యాలు వాల్‌మార్ట్‌ను ఆకర్శించింది. గతంలో చైనా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకున్న కంపెనీ చైనా దిగుమతులను తగ్గించి భారతదేశం నుంచి దిగుమతులు చేసుకోవడానికి సుముఖత చూపింది. ఇందులో భాగంగానే ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాను కొనుగోలు చేసింది. 2027 నాటికి మన దేశం నుంచి మొత్తం 10 బిలియన్ డాలర్స్ విలువైన వస్తువులను కంపెనీ దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వాల్‌మార్ట్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా ఆల్బ్రైట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా నుంచి వాల్‌మార్ట్ దిగుమతులు ఏడాదికి 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీ భారత ప్రభుత్వంతో మంచి రిలేషన్ పెంచుకుంటూ.. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

టెస్లా ‘సైబర్‌ట్రక్‌ డెలివరీలు ఎట్టకేలకు మొదలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా ‘సైబర్‌ట్రక్‌’ (Cybertruck) డెలివరీలు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఈ కొత్త సైబర్‌ట్రక్‌ వేరియంట్స్, ధరలు, రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెస్లా సైబర్‌ట్రక్‌ ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ట్రక్ డెలివరీలు సౌత్ అమెరికాలో మాత్రమే జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని డెలివరీలు జరిగే అవకాశం ఉంది.కొత్త టెస్లా సైబర్‌ట్రక్‌ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. దీని కోసం ముందస్తుగా 100 డాలర్లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్‌పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్‌ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ ట్ర‌క్‌ను 2025 నాటికి తక్కువ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

రూపే క్రెడిట్ కార్డ్‌తో అధిక విలువ కలిగిన యూపీఐ చెల్లింపులు

రుపే క్రెడిట్‌ కార్డులను యూపీఐకి అనుసంధానించి, పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) భావిస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల విషయంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ఎంతో ఆదరణ పొందింది. చిన్న దుకాణాల్లో చెల్లింపులు మొదలు, విమాన టిక్కెట్ల బుకింగ్‌ వరకూ అన్నీ యూపీఐతోనే చేసేస్తున్నారు. ఇ-కామర్స్‌ కొనుగోళ్లు సాధారణంగా క్రెడిట్‌ కార్డుతో ఎక్కువగా  జరుగుతుంటాయి. ఇలాంటి అధిక విలువగల కొనుగోళ్లనూ యూపీఐ ఆధారంగా నిర్వహించేలా చూసే విషయంపై ఎన్‌పీసీఐ దృష్టి పెడుతోంది.ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం చూస్తే.. క్రెడిట్‌ కార్డుపై సగటు లావాదేవీల విలువ రూ.2,000 వరకూ ఉంటోంది. అదే యూపీఐ లావాదేవీల సగటు విలువ రూ.650గా ఉంది. ఈ సగటు లావాదేవీ విలువను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఎన్‌పీసీఐ ప్రయత్నిస్తోంది. రుపే క్రెడిట్‌ కార్డులను యూపీఐతో అనుసంధానించుకొని, చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించినప్పటికీ.. దీనికి అంత ఆదరణ లభించడం లేదు. ప్రీమియం స్టోర్లు, రిటైల్‌ అవుట్‌లెట్లలో అధిక విలువైన లావాదేవీలను నేరుగా కార్డులతోనే చెల్లిస్తున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం రుపే క్రెడిట్‌ కార్డులతో చేసే యూపీఐ చెల్లింపులపై బ్యాంకులు పరిమితి విధించడమే. కొన్నిసార్లు వినియోగదారులూ ఈ పరిమితిని విధించుకోవచ్చు. అంతేకాకుండా కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే యూపీఐతో రుపే కార్డు అనుసంధానం చేసుకునేందుకు అనుమతినిస్తున్నాయి.ఈ విషయంలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని, రుపే క్రెడిట్‌ కార్డుతో యూపీఐ లావాదేవీల మొత్తాన్ని పెంచాలని ఎన్‌పీసీఐ బ్యాంకులను కోరుతోంది. అంతేకాకుండా, అన్ని బ్యాంకులూ దీనికి అనుమతించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అన్ని బ్యాంకులకూ ఎన్‌పీసీఐ ఈ మేరకు అభ్యర్థనను పంపించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. బ్యాంకులు యూపీఐ పరిమితి పెంచుకునేందుకు అనుమతిస్తే.. డిజిటల్‌ లావాదేవీల సంఖ్య మరింత వృద్ధి చెందుతుందని ఎన్‌పీసీఐ భావిస్తోంది.