నాగచైతన్య (Naga Chaitanya) నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’ (Dhootha). ఈ వెబ్‌సిరీస్‌కు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) దర్శకత్వం వహించారు. ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను తాజాగా నాగార్జున వీక్షించారు. నాగచైతన్య నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ‘‘దూత’ సిరీస్‌ను తాజాగా చూశాను. ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. చై అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతడి నటన చూసి ఆశ్చర్యపోయా. టీమ్ మొత్తానికి నా అభినందనలు’’ అని నాగ్ ట్వీట్ చేశారు.
సాగర్ వర్మ అవధూరి (నాగచైతన్య) ప్రముఖ జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభం కాబోయే సమాచార్ పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడి సహాయకురాలిగా అమృత (ప్రాచీ దేశాయ్), మరో సీనియర్ జర్నలిస్ట్ చంద్రమూర్తి (వి.జయ ప్రకాష్)లు కూడా అదే రోజున ఉద్యోగంలో చేరతారు. ఓరోజు సాగర్‌కు ఓ పేపర్ క్లిప్ దొరుకుతుంది. అందులో అతడి శునకం (ఎ) మరణించినట్లు రాసి ఉంటుంది. ఆ క్లిప్ చూసిన కొద్ది సేపటికే ఆ శునకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతుంది. అలా, సాగర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతడిని కలిసిన వారు ఏదో ఒక కారణంతో చనిపోతూ ఉంటారు. వారు ఎలా చనిపోబోతున్నారో ముందే తెలియజేస్తూ ఓ పాత న్యూస్‌పేపర్ ఆర్టికల్ క్లిప్పింగ్స్ సాగర్‌కు కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ అయిన సాగర్ జీవితం ఎలా మలుపులు తిరిగింది? కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఈ హత్యలకు స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాజ్యం వచ్చిన తర్వాత ‘దూత’ పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి)కి సంబంధం ఏమిటి? ఈ కేసులను డీసీపీ క్రాంతి షినోయ్ (పార్వతి తిరువత్తు) ఎలా ఛేదించింది? అనే అంశాలతో ఇది సిద్ధమైంది.
👉 – Please join our whatsapp channel here –