DailyDose

తెలంగాణకు కొత్త డీజీపీ

తెలంగాణకు కొత్త డీజీపీ

తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీపీని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీ అంజనీకుమార్‌, ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేశ్‌భగవత్‌.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ.. రేవంత్‌రెడ్డిని కలవడంతో డీజీపీని సస్పెండ్‌ చేసిన ఈసీ, ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు జారీ చేసింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు అంజనీకుమార్‌ తరువాత సీనియర్‌ అధికారిగా ఉన్న రవిగుప్తా బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z