Politics

కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు

కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటుకు 60 స్థానాలు అవసరం. ఇప్పటికే గెలుపొందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌కు చేరుకుంటున్నారు. మరో వైపు పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు సేకరించనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్ఠానానికి పంపిన తర్వాత సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z