Movies

చాముండేశ్వరి దర్శనం చేసుకున్న రామ్ చరణ్

చాముండేశ్వరి దర్శనం చేసుకున్న రామ్ చరణ్

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైసూరు చాముండేశ్వరి దర్శనం చేసుకున్నారు. ఆదివారం (డిసెంబర్ 3) తెల్లవారుజామున చాముండి కొండపై కొలువైన అమ్మవారిని సందర్శించి పూజాదికార్యక్రమాలను నిర్వహిచారు. రామ్ చరణ్ తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ కోసం మైసూర్ లో బస చేశారు. చిత్రబృందంతో కలిసి వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన వీడియో వైర‌ల్‌గా మారింది. ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతుంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా తన ఓటు హక్కుని మైసూర్ నుంచి హైదరాబాద్ వచ్చి మరీ వినియోగించుకున్న సంగతి తెలిసిందే.. కాగా శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చెంజర్ సినిమాపై అటు టాలీవుడ్ లో కన్నడ సినీవర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

చాలా రోజులుగా రామ్ చరణ్ మైసూర్ లోనే ఉంటున్నాడు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఆయనకు స్వల్ప విరామం లభించింది. మైసూర్‌లో జరుగుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌ కు విరామం ప్రకటించి హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ సమయంలో చెర్రీ విమానాశ్రయంలో కనిపించాడు. అప్పుడు సందర్భంగా తీసిన వీడియో వైరల్‌గా మారింది. నవంబర్ 30న ఓటు వేసిన తర్వాత మైసూర్‌కు తిరిగి వచ్చారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్ గా తెరకెక్కిన 2022లో రిలీజైన ‘RRR’ చిత్రం అపూర్వమైన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలోని పాటకు ఆస్కార్‌ కూడా దక్కింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్‌ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. మైసూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్నందున ఈ సినిమా స్టోరీలో కర్ణాటకకు సంబంధించిన ఉంటుందని తెలుస్తోంది.

‘గేమ్ ఛేంజర్’ సినిమా రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ముహూర్తపు వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. మెగా స్టార్ చిరంజీవి, రణవీర్ సింగ్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z