Politics

కాంగ్రెస్ గెలుపు వెనుక సూత్రధారి

కాంగ్రెస్ గెలుపు వెనుక సూత్రధారి

కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్!ఇతనే సునీల్ కనుగోలు.

తెలంగాణలో కాంగ్రెస్ విజయం.

64 సీట్లు గెలిచిన హస్తం పార్టీ.

చాపకింద నీరులా పనిచేసుకుపోయిన సునీల్ కనుగోలు.

అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సునీల్ మార్కు.

ప్రశాంత్ కిశోర్ సహచరుడే ఈ సునీల్ కనుగోలు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఎలాంటి సందేహాలు లేకుండా ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమైంది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలపై బలమైన ముద్ర వేసినా, ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు మెరుగైన ఓట్ షేర్ లభించినా, రేవంత్ రెడ్డి మొదలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, జానారెడ్డి వంటి సీనియర్లందరూ ఏకతాటిపై నిలిచినా, కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై అధిక దృష్టి పెట్టినా… ఇలా ప్రతి అంశం వెనుక ఉన్న హస్తం… సునీల్ కనుగోలు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z