మిగ్‌జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించినందున పాదయాత్రకు మూడు రోజుల విరామం ఇస్తున్నట్లు నేతలు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు యువగళం పాదయాత్ర చేరింది. తుపాను కారణంగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి ‘యువగళం’ ప్రారంభించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –