ScienceAndTech

అధునాతన భద్రతా ఫీచర్లతో సరికొత్త పెన్ డ్రైవ్

అధునాతన భద్రతా ఫీచర్లతో సరికొత్త పెన్ డ్రైవ్

ఇది స్మార్ట్‌యుగం. ఇక్కడ వ్యక్తిగత, వృత్తిగత డేటా చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే లెక్సర్‌ సంస్థ.. అత్యాధునిక భద్రతా ఫీచర్లతో సరికొత్త పెన్‌డ్రైవ్‌ను తయారుచేసింది. పాస్‌వర్డ్‌, పిన్‌ నెంబర్ల గోల లేకుండా.. బిల్ట్‌ఇన్‌ ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌తో ‘జంప్‌డ్రైవ్‌ ఎఫ్‌35’ను విడుదల చేసింది. ఈ ఫీచర్‌.. పెన్‌డ్రైవ్‌లోని డేటాకు అదనపు భద్రత కల్పిస్తుంది. యూఎస్‌బీ 3.0 ద్వారా.. 3,000 ఎంబీపీఎస్‌ వేగంతో ఇది పనిచేస్తుంది. 256 ఏఈఎస్‌ ఎన్‌క్రిప్షన్‌ వల్ల పర్సనల్‌ – ప్రొఫెషనల్‌ డేటాకు సెక్యూరిటీని అందిస్తుంది. ‘అల్ట్రా ఫాస్ట్‌ రికగ్నిషన్‌’ టెక్నాలజీ ద్వారా క్షణంలోపే యూజర్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. ఈ పెన్‌డ్రైవ్‌ కోసం ప్రత్యేకించి ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ డ్రైవర్స్‌ను వాడాల్సిన అవసరం లేదు. మూడేళ్ల వారంటీతో లభించే ఈ ‘జంప్‌డ్రైవ్‌ ఎఫ్‌35’ ప్రారంభ ధర రూ. 4,500. lexar.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వెలాప్‌తో వెరీ ఫాస్ట్‌!

కరోనా కారణంగా.. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ పెరిగింది. ఇంకా ఈ విధానం అక్కడక్కడా పాక్షికంగా కొనసాగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌.. అత్యాధునిక వైఫై సిస్టమ్స్‌ అవసరం ఏర్పడుతున్నది. దీన్ని గుర్తించిన ‘లింక్‌సిస్‌’ సంస్థ.. సరికొత్త ఫీచర్లతో వైఫై సిస్టమ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘వెలాప్‌ ప్రో 7’ పేరుతో వచ్చిన ఈ పరికరం.. అత్యాధునిక వైఫై-7 మీద పనిచేస్తుంది. వైఫై-6తో పోలిస్తే.. వేగం ఐదురెట్లు ఎక్కువ. 10 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ పొందవచ్చు. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకూ వైఫై కవరేజీ ఇస్తుంది. ఏకకాలంలో 200 పరికరాలకు అనుసంధానం చేసుకోవచ్చు. సైబర్‌ నేరాల నుంచి నెట్‌వర్క్‌ను కాపాడేందుకు అధునాతన భద్రత, ఫైర్‌వాల్‌ వ్యవస్థ ఉంది. అద్భుతమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వేగాన్ని అందిందించే ఈ వైఫై సిస్టమ్స్‌ ధర.. రూ.83,000. అన్ని ప్రముఖ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

కిర్రాక్‌.. క్రాక్స్‌

వియత్నాం కంపెనీ క్రాక్స్‌.. యువతరం మెచ్చేలా పలురకాల చెప్పులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా.. ‘ఇకో క్లాగ్స్‌’ పేరుతో సరికొత్త మాడల్స్‌ విడుదల చేసింది. ఈ మాడల్స్‌ను చాలా తేలికగా రూపొందించింది క్రాక్స్‌. వేసుకోవడానికి కూడా సులభంగా ఉంటాయి. ఈ చెప్పులు వాటర్‌ ఫ్రెండ్లీ. క్షణాల్లో తడి ఆరిపోతాయి. అదనపు సౌకర్యం కోసం వెనక వైపు పట్టీని కూడా ఏర్పాటు చేశారు. కాళ్లకు కావాల్సినంత గాలి ఆడేలా.. ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. విభిన్న రంగుల్లో లభించే ఈ సరికొత్త క్రాక్స్‌ ఖరీదు.. రూ.6,495 నుంచి ప్రారంభం. crocs.inతోపాటు అన్ని ప్రముఖ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ దొరుకుతాయి.

నేత్రాలకు నేస్తం

నేటి జెనరేషన్‌లో 80 శాతం మంది స్క్రీన్‌టైమ్‌ పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. కంప్యూటర్‌పై పని చేయడం; వీడియో గేమ్స్‌ ఆడటం; సోషల్‌ మీడియాలో గంటల తరబడి టైమ్‌పాస్‌ వల్ల.. కళ్లు ఎక్కువగా
ఒత్తిడికి గురవుతున్నాయి. సరైన విశ్రాంతి లేక, పిల్లల నుంచి పెద్దల వరకు.. ప్రతి ఒక్కరి కళ్లూ తీవ్రంగా అలసిపోతున్నాయి. ఈ సమస్య నుంచి కళ్లను కాపాడేందుకు భారత్‌కు చెందిన జెక్‌ సంస్థ.. ‘ఐసూత్‌ ఐ మసాజర్‌’ను లాంచ్‌ చేసింది. కళ్లద్దాలను పోలి ఉండే ఈ మసాజర్‌.. కళ్లపై ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. సుఖంగా నిద్ర పోయేందుకు సాయపడుతుంది. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరంలో ఐదు మోడ్స్‌ ఉంటాయి. అవసరానికి తగ్గట్టుగా ప్రెషర్‌, వైబ్రేషన్‌, హీట్‌, మ్యూజిక్‌ లాంటివి అందిస్తుంది. కళ్లు, కళ్ల చుట్టూ మసాజ్‌ చేస్తుంది. సైనస్‌సమస్యలనూ దూరం చేస్తుంది. ఈ సమాచారాన్నంతా బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ కళ్ల మసాజర్‌ ధర రూ.5,299. xech.comలో లభిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z