తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకున్న తర్వాత అందరూ దీని గురించే చర్చిస్తున్నారు. దీంతో పాటు మరో అంశం ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణకు ఐటీ మినిస్టర్ ఎవరు కాబోతున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ధి కోసం కేటీఆర్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు ( ఎక్స్ ) చేస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది కాదు.. కేటీఆర్‌కు సరిపోయే ఐటీ మినిస్టర్‌ను కాంగ్రెస్ తీసుకురాగలదా? అని చర్చించుకుంటున్నారు..
‘ ఇప్పటివరకు మేం చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరే’.. ‘తెలంగాణ బెస్ట్ ఐటీ మినిస్టర్‌ను కోల్పోయింది’. అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఇకపై కేటీఆర్ ఐటీ మినిస్టర్ కాదని తెలిసి నా ఐటీ జాబ్‌కు రాజీనామా చేస్తున్నామని కొంతమంది ట్వీట్లు చేశారు. ఐటీ మినిస్టర్ అనే పదానికి కేటీఆర్ రోల్ మాడల్ అని.. విజినరీ నాయకత్వాన్ని మిస్సవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందింది.. ఉద్యోగవకాశాలతో లక్షలాది మంది ఇక్కడ జీవిస్తున్నారంటే దానికి కారణం మీరేనంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ను ట్రెండ్ సెట్టర్ అంటూ కొనియాడుతున్నారు.
https://twitter.com/i/status/1731355160142835971
👉 – Please join our whatsapp channel here –