Politics

అమరావతి రాజధానిపై ఏపీకి మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

అమరావతి రాజధానిపై ఏపీకి మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఏపీ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి కౌశల్‌కుమార్‌ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు మాస్టర్‌ ప్లాన్‌లు ఉన్నాయని స్పష్టం చేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు వెల్లడించారు. అమరావతికి సైతం మాస్టర్‌ ప్లాన్‌ ఉందన్నఆయన.. దీనిని సైతం కేంద్రం ఆమోదించినట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z