మిగ్‌జాం తుపాను కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు.. షెడ్యూల్ ప్రకారం మంగళవారం శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే, తుపాను కారణంగా పర్యటనను వాయిదా వేసిన చంద్రబాబు.. రానున్న రోజుల్లో శ్రీశైలం మల్లన్న, కడప దర్గా, మేరీమాత చర్చిలను దర్శించుకోనున్నారు.మరోవైపు, తుపాను నేపథ్యంలో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి.
👉 – Please join our whatsapp channel here –