Politics

ముగిసిన సీఎల్పీ సమావేశం

ముగిసిన సీఎల్పీ సమావేశం

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) (Congress) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదికను అధిష్ఠానానికి పంపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. సాయంత్రానికి సీఎం ప్రమాణస్వీకారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు సీఎల్పీ సమావేశానికి ముందు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ భేటీ అయ్యారు. పార్క్‌హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులతో వివిధ అంశాలపై డీకే చర్చలు జరిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z