మిగ్‌జాం తుపాను (Cyclone Michaung)కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
దీంతో పాపవినాశన రోడ్డులోని జాపాలి ఆలయం, ఆకాశగంగ తదితర ప్రదేశాల సందర్శనకు వెళ్లే భక్తులను నిలిపివేశారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా మూసివేశారు. భారీగా చెట్లు పడటం.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –