Videos

ఈగల్‌ AaduMacha సాంగ్ ప్రోమో

ఈగల్‌ AaduMacha సాంగ్ ప్రోమో

టాలీవుడ్ యాక్టర్‌ రవితేజ (Ravi Teja) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ఈగల్‌ (Eagle). కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, స్టైలిష్ లుక్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈగల్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం ఫస్ట్ సింగిల్‌ AaduMacha సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటలో రవితేజలోని నయా మాస్‌ అవతార్‌ కనిపిస్తోంది.

ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫుల్ లిరికల్‌ వీడియో సాంగ్‌ను డిసెంబర్ 5న లాంఛ్ చేయనున్నారు. ఈ చిత్రం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే మాస్ మహారాజా లాంగ్ హెయిర్‌, గడ్డంతో బ్లాక్ స్టైలిష్‌ గాగుల్స్ పెట్టుకొని ఉండగా.. ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తున్న లుక్‌.. ఈ సారి రవితేజ విధ్వంసం దద్దరిల్లిపోయేలా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేస్తుంది.

ఇక ఈగల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్‌ పట్టుకుని కాన్సెప్ట్‌ పోస్టర్‌తో సినిమాలో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఈగల్‌లో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

రవితేజ మరోవైపు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో RT4GM (వర్కింగ్‌ టైటిల్‌)తో సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z