Politics

తెలంగాణలో ఎన్నికల కోడ్ తొలగింపు

తెలంగాణలో ఎన్నికల కోడ్ తొలగింపు

తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల కోడ్‌ను ఈసీ ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో తెలంగాణలో అక్టోబర్‌ 9 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 3న ఎన్నికల ప్రకటన జారీ కాగా, 10వ తేదీ వరకు నామపత్రాలను స్వీకరించారు. 13న నామపత్రాల పరిశీలన, 15న ఉప సంహరణ తర్వాత 30న పోలింగ్‌ జరిగింది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z