పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్ (Salaar) ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన సలార్ ట్రైలర్ యూట్యూబ్‍లో రికార్డులు బద్దలు కొడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ల (15కోట్లు)కు పైగా వ్యూస్ దాటాయి.
ఈ ట్రైలర్‌కి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా ఎదురవ్వడం చర్చనీయాశంగా మారింది. ఈ ట్రైలర్‌ని చూసిన కొందరు క్రిటిక్స్.. సినేరియా మొత్తం ‘కేజీఎఫ్’ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉందని, దీన్ని ‘కేజీఎఫ్ 3’ అనుకోవచ్చని విమర్శలు గుప్పించారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ సలార్ నుంచి రెండో ట్రైలర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్‌ను సినిమా విడుదలకు 5 రోజుల ముందు చిత్రబృందం విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్‌గా.. ప్రభాస్ రోల్‌ని హైలెట్ చేస్తుందని తెలుస్తుంది. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెల 21న ‘సలార్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –