Sports

జూనియ‌ర్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్స్ లో భార‌త యువ బాక్స‌ర్లు స‌త్తా

జూనియ‌ర్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్స్ లో భార‌త యువ బాక్స‌ర్లు స‌త్తా

అర్మేనియాలోని యెరెవ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న ఇంటర్నేష‌న‌ల్ బాక్సింగ్ అసోసియేష‌న్ (ఐబీఏ) జూనియ‌ర్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్స్ లో భార‌త యువ బాక్స‌ర్లు స‌త్తా చాటుతున్నారు. ఇదివ‌రకే ఈ పోటీల‌లో భార‌త్ నుంచి 12 మంది బాక్స‌ర్లు తుది పోరుకు అర్హ‌త సాధించ‌గా వీరిలో ముగ్గురు ర‌జ‌తాల‌తో స‌రిపెట్టుకున్నారు. మ‌రో తొమ్మిది మంది బాక్స‌ర్లు స్వ‌ర్ణాల కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ర‌జ‌తం సాధించిన‌వారిలో అమిషా కెరెట్ట‌, ప్రాచి టోకొస్, హార్ధిక్ ప‌న్వ‌ర్‌లు సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్కించుకున్నారు.

ఆదివారం రాత్రి ముగిసిన ఫైన‌ల్స్‌లో ఆసియ‌న్ జూనియ‌ర్ ఛాంపియ‌న్ హార్ధిక్ ప‌న్వ‌ర్ (80 కిలోలు).. 2-3 తేడాతో ర‌ష్యాకు చెందిన అషురోవ్ చేతిలో ఓడిపోయాడు. 54 కిలోల విభాగంలో పోటీ ప‌డుతున్న అమిషా.. 0-5 తేడాతో క‌జ‌కిస్తాన్‌కు చెందిన అయిజాన్ సిదిక్ చేతిలో ఓడింది. 80 కిలోల విభాగంలో బ‌రిలోకి దిగిన ప్రాచి కూడా 0-5 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సొబిర‌ఖోన్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది.

ఈ టోర్నీలో భార‌త్ ఇంకా పాయ‌ల్ (48 కిలోలు), నిషా (52 కిలోలు), విని (57 కిలోలు), సృష్టి (63 కిలోలు), ఆకాన్ష (70 కిలోలు), మేఘ (80 కిలోలు), జ‌తిన్ (54 కిలోలు), సాహిల్ (75 కిలోలు), హేమంత్ (80 కిలోలు)లు త‌మ భవితవ్యాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఈ పోటీల‌లో భార‌త్ వివిధ విభాగాల‌లో ఇదివ‌ర‌కే 17 ప‌త‌కాలు ఖాయం చేసుకున్న విష‌యం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z