కమల్‌హాసన్, మణిరత్నం.. అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి 36ఏళ్లు నిండాయి. అంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కమల్‌హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. ప్రకటన వచ్చిన నాటినుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. విభిన్న కథలతో సినిమాలు చేసే మణిరత్నం.. కమల్‌తో చేయబోతున్న సినిమాకు ఏ తరహా కథను ఎంచుకొని ఉంటాడన్నది ఇప్పుడు సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అంచనాలకు అందని రీతిలో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయనేది చెన్నయ్ సమాచారం. ఇదిలావుంటే, ఇందులో కథానాయికగా త్రిష, నయనతార పేర్లు అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ దాదాపు ఖరారైనట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు వీరెవర్నీ కాకుండా మలయాళం కథానాయిక మంజు వారియర్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేశారనేది టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నవి. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –
‘
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z