Politics

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా?

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా?

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని.. ఏఐసీసీకి అప్పగించారు సీనియర్లు. ఢిల్లీలో సోనియాగాంధీ అధ్యక్షతను పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవటంతో.. సీఎం ప్రమాణ స్వీకారం డిసెంబర్ 4వ తేదీన వాయిదా వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. హైకమాండ్ పిలుపు మేరకు.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రాజ్ భవన్ లో ఏర్పాట్లు సైతం జరిగాయి. సీఎల్పీ భేటీలోని అంశాలపై హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో.. వాయిదా పడినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z