మేషం
ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం
కుటుంబపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ, తిప్పట తప్పక పోవచ్చు. ఉద్యోగ బాధ్యతలను చాలావరకు నెరవేరుస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అను కూలంగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. మిత్రులకు ఆర్థికంగా సాయం చేయడం జరుగు తుంది.
మిథునం
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు పడడం జరుగుతుంది. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కర్కాటకం
ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపా రాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.
సింహం
ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభి స్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.
కన్య
సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూ లంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపతాపాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభి స్తుంది.
తుల
రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకా లంలో పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవ కాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది.
వృశ్చికం
కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవు తుంది. ఆదాయం పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గతంలో వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. ఆరోగ్యం పరవా లేదు.
ధనుస్సు
ఆర్థికంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్దిపాటి ప్రయత్నంతో పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మకరం
రోజంతా ప్రశాంతంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం
ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన పనుల మీదా, సొంత పనుల మీదా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
మీనం
సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అను కున్న పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –