తెలంగాణ సీఎం ఎవరు?మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (డీకేఎస్), తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే నేడు దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. సోమవారం రాత్రే దిల్లీ చేరుకున్న డీకేఎస్, ఠాక్రే.. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖర్గేతో భేటీ అవుతారు. ఇప్పటికే తెలంగాణ పరిణామాలపై ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలకు డీకే శివకుమార్ సమాచారం ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా దిల్లీకి బయల్దేరివెళ్లారు. వారిద్దరు కూడా ఖర్గేతో సమావేశం కానున్నారు.సోమవారం సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. రాత్రికి ప్రమాణస్వీకారం ఉంటుందని తొలుత ప్రచారం జరిగినా.. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో అది వాయిదా పడింది. నేడు ఖర్గేతో డీకే శివకుమార్, ఠాక్రే భేటీ అనంతరం దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
👉 – Please join our whatsapp channel here –