మిజ్‌గాం తుపాను తిరుమలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కుమారధార, పసుపుధార, కల్యాణి జలాశయాలు పూర్తిగా నిండాయి. తిరుమలగిరుల నుంచి వస్తున్న వరదతో మల్వాడిగుండం పోటెత్తుతోంది. జలపాతం ఉధృతితో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. స్కావెంజర్ కాలనీ, గొల్లవానిగుంట, ఆటోనగర్‌లో కాలనీలు నీట మునగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
👉 – Please join our whatsapp channel here –