బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ఇప్పుడు ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. హిందీ సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో పఠాన్, జవాన్ అంటూ వచ్చి వరస హిట్స్‌తో తనేంటో నిరూపించుకున్నాడు. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో వచ్చిన షారుక్.. ఇప్పుడు డంకీతో మూడో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాకు పోటీగా వస్తుండటంతో డంకీ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో అక్రమ వలసల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమాతో షారుక్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ డంకీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు
డ్రాప్-4 పేరుతో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఫన్ అండ్ ఎమోషన్స్ కలగలిపి ఎంతో ఆసక్తికరంగా ఉంది. షారుక్‌ఖాన్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్.. మూడు నిమిషాల పాటు సాగింది. ఈ నిడివిలోనే సినిమా స్టోరీ ఏంటో సింపుల్‌గా చెప్పేశారు మేకర్స్. ఇందులో ఇంగ్లీష్ నేర్చుకుని లండన్‌లో సెటిల్ అవ్వాలని కలలు కనే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ కనిపించాడు. అతనితో పాటు మరో నలుగురు స్నేహితులు లండన్ వెళ్లడం కోసం ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ప్రయత్నించడం, వీసా రాక ఇబ్బందులు ఎదుర్కోవడం నవ్వు తెప్పించాయి. వీసా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ కావడంతో ఎలాగైనా లండన్ వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది స్టోరీ అన్నట్లుగా ట్రైలర్ చూస్తే కనిపిస్తున్నది. కామెడీతో పాటు ఎమోషన్స్ కలగలిపిన సీన్స్ ఉండటం చూస్తుంటే ఈ సినిమా పక్కా హిట్ కొట్టడం ఖాయమని అనిపిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –