Movies

దేవర టీజర్‌కి డేట్ లాక్ అయిందా?

దేవర టీజర్‌కి డేట్ లాక్ అయిందా?

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ ఏవైటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ దేవర ఒకటి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు దేవర సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలు భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్, జాన్వీ ఫై సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. లేటెస్ట్ రాకింగ్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న దేవర సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పుడు దేవర మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం డేట్ ను కూడా లాక్ చేశారని తెలుస్తుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా దేవర మూవీ టీజర్ ను రిలీజే చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక అప్డేట్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.. మొదటి భాగాన్ని 2024 ఏప్రిల్ 5 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దేవర సినిమాతో తారక్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z