అర్జెంట్‌గా తమకో వంటమనిషి కావాలని, ఎవరైనా ఉంటే వెంటనే పంపమని కోరుతూ ఆ రోజుల్లో మద్రాసు నుంచి కాకినాడలో ఓ పెద్దింటి ఇల్లాలికి ఉత్తరం వచ్చింది. వెంటనే ఆవిడ తనకు బాగా తెలిసిన వంటమనిషితో మాట్లాడింది. జీతభత్యాలు, ఇతర ప్రోత్సాహకాలు బాగా ఉండటంతో – ఎవరు? ఏమిటి? లాంటి ప్రశ్నలు అడగకుండానే ఆ వంటామె ఒప్పుకొంది. మూటా ముల్లె సర్దుకుని, పెద్దింటి ఇల్లాలితో కలిసి స్టేషన్‌కు వచ్చింది. అప్పుడు ప్లాట్‌ఫారం మీద ఆవిడకు తెలిసిన వ్యక్తులెవరో తారసపడి, ‘ఏమిటి మద్రాసు వెళ్తున్నావా?’ అని అడిగారు. అప్పుడామె ‘అబ్బే నేను వెళ్ళటం లేదు. మా సూర్యకాంతం (Suryakantham) వంటావిడ కావాలని ఉత్తరం రాస్తే, బాగా తెలిసిన వంటామెను మద్రాసు రైలెక్కించడానికి వచ్చాను’ అంది. అప్పటికి బండి బయలుదేరడానికి కొన్ని నిమిషాల వ్యవధి ఉంది. సిగ్నల్ పడి, గార్డు విజిల్ వేసేలోపల బండిలోని వంటావిడ, ‘వామ్మో… సూర్యకాంతం ఇంట్లో వంట చెయ్యాలా?’ అంటూ తన లగేజీ చంకలో పెట్టుకుని చటుక్కున ప్లాట్‌ఫారం మీదికి దిగిపోయిందట!
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z