Business

క్యాబ్‌లతో సేవలు ప్రారంభించిన రాపిడో

క్యాబ్‌లతో సేవలు ప్రారంభించిన రాపిడో

రైడ్‌ సేవలు అందించే ర్యాపిడో, క్యాబ్‌ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్‌ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీపడనుంది. దిల్లీ- ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబ్‌లతో ఈ సేవలను ర్యాపిడో ప్రారంభించింది. 2024 సెప్టెంబరుకు వీటిని 35 నగరాలకు విస్తరిస్తామని సంస్థ సహవ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తెలిపారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్‌ ఆధారిత సేవలు అందించి, మార్కెట్‌ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. సున్నా కమీషన్‌ మోడల్‌తో చోదకుల ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z