ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్రెడ్డి. బుధవారం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి వారిని ఆయన ఆహ్వానించనున్నారు. అనంతరం కేబినెట్ కూర్పుపైనా వారితో చర్చించనున్నారు. అటు అర్ధరాత్రి డీకే శివకుమార్, మాణిక్కం ఠాగూర్లను రేవంత్ కలిశారు.
👉 – Please join our whatsapp channel here –