* అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బస్సు
థాయ్‌లాండ్‌లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 14 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయాలయిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం బస్సు అతివేగం వల్ల చెట్టును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
* ఒకే రోజు ఏకంగా ఆరుగురు చిన్నారులు అదృశ్యం
మహారాష్ట్రలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు చిన్నారులు కనిపించకుండా (Childrens Missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం నుంచి సోమవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. థానే జిల్లాలోని (Thane district) నవీ ముంబై టౌన్‌షిప్ (Navi Mumbai township) పరిసర ప్రాంతాల నుంచి వీరంతా మిస్సైనట్లు వెల్లడించారు. కనిపించకుండా పోయిన వారిలో నలుగురు మైనర్ బాలికలు కాగా, ఇద్దరు బాలురు. అయితే, ఓ బాలుడు మాత్రం తిరిగి తన కుటుంబం వద్దకు చేరినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన (Police) వివరాల ప్రకారం.. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లు డిసెంబర్ 3 నుంచి 4 మధ్య కనిపించకుండా పోయారు. అందులో కలంబోలి (Kalamboli) ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఆదివారం తన క్లాస్‌మేట్ పుట్టినరోజు వేడుకలకు అని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. మరో కేసులో పన్వేల్ (Panvel)కు చెందిన 14 ఏళ్ల బాలిక ఆదివారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అయితే అక్కడి నుంచి తిరిగి రాలేదు. కమోతే (Kamothe) ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక సోమవారం తన ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది.రబలే (Rabale) ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక సైతం సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఇక అదే ప్రాంతానికి (రబలే) చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా సోమవారం తెల్లవారుజామున టాయిలెట్‌కని వెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆ బాలుడి జాడ తెలియరాలేదు. ఇక కోపర్‌ఖైర్నే (Koparkhairne) ప్రాంతం నుంచి తప్పిపోయిన ఓ 12 ఏళ్ల బాలుడు మాత్రం కాసేపటికి తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిస్సింగ్ ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. పిల్లల జాడ కోసం గాలింపు చేపడుతున్నట్లు వారు వివరించారు.
* రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య
జైపూర్‌లో దారుణం జరిగింది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన దుండగులు గోగమేడిని పిస్టల్‌తో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో గోగమేడి తన ఇంటి బయట నిలబడి ఉండగా స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.తీవ్రంగా గాయపడిన గోగమేడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో గోగమేడితో పాటు ఉన్న అజిత్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
* కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చీర్యాల గ్రామ పరిధిలో AP 28 T 2778 లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న AP 29 AH 2013 ప్యాషన్ బైక్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న కోటయ్య (37 ), తో సహా ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు చిర్యాల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
* కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను రాంగ్ డైరెక్షన్‌లో వచ్చిన ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్ లక్నోలోని అవధ్ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నుంచి ఓ కారు వైగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది. ట్రాపిక్‌ను అదుపులో ఉంటే కానిస్టేబుల్ భద్రతలేకుండా పోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు పేర్కొన్నారు.
* అనంతపురంలో దారుణం
అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం పేరుతో నమ్మించి నమ్మిన స్నేహితుడి ప్రాణాలనే తీసాడు ఓ కిరాతకుడు. వివరాలలోకి వెళ్తే.. అనంతపురం లోని మున్నానగర్ ప్రాంతానికి చెందిన అలీ అనే యువకుడు గత నెల 27వ తేదీన ఇంట్లో బెంగుళూరు వెళ్లుతున్నానని చెప్పి వెళ్ళాడు. అయితే ఆ తరువాత అలీ ఫోన్ నుండి ఎలాంటి కాల్స్ రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అనంతపురం నగరంలోని వన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూసాయి. అలీగా తన స్నేహితుడే హత్య చేశారు.అనంతరం ఆనవాళ్లు దొరకకుండా మృతదేహాన్ని దహనం చేసాడు. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ హత్య బయట పడింది. దీనితో అలీని నమ్మించి స్నేహితుడే హత్య చేసినట్లు పోలీసుల నిర్థారణకు వచ్చారు. ఈ నేపాహ్యంలో నిందితుడు హత్యా నేరం నుండి తప్పించుకోవడానికి దృశ్యం సినిమా కథ అల్లినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నిందితుడు పోలీసుల ఆధీనంలో ఉన్నారు. నిందితుడు అలీని హత్య చేయడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి విచారిస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలు తెలియాల్సి ఉంది. అలీ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –