టాలీవుడ్ సీనీయర్ హీరో బాలకృష్ణ కుర్రహీరోలకంటే వేగంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు యంగ్ హీరోలతో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాలు ఎక్కువశాతం బాక్సాఫీస్ వద్ద డిజాస్ట్రర్ అవుతుంటే.. బాలయ్య నటించిన సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల ఆయన నటించిన ఏ సినిమా కూడా అభిమానులను, నిర్మాతలను నిరాశపరచలేదు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్లు సైతం బాలయ్యబాబుతో నటించేందుకు రెడీ అవుతున్నారు. కాజోల్, నయనతార, శ్రీలీల, ప్రగ్వా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా వంటి బాలీవుడ్ భామలు కూడా బాలయ్య మూవీ అంటే కళ్లు మూసుకుని ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది.
అయితే ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలయ్య.. మరో యంగ్ డైరెక్టర్ బాబీతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రం భిన్న కాలాల్ని ప్రతిబింబించే కథతో రూపొందుతుందట. ఆ కథ సాగే కాలానికి తగ్గట్టుగానే బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది.
అంతేకాదు ఆయన సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఊటీలో చిత్రీకరణ జరుగుతుండగా.. బాలకృష్ణ, కథానాయిక ఊర్వశీ రౌతేలాతోపాటు ఇతర తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో మీనాక్షి చౌదరితోపాటు మరో స్టార్ హీరోయిన్ కూడా నటించబోతుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
👉 – Please join our whatsapp channel here –