Sports

మూడు స్వర్ణ పథకాలను గెలుచుకున్న భారత్‌

మూడు స్వర్ణ పథకాలను గెలుచుకున్న భారత్‌

ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాయల్‌, నిషా, ఆకాన్ష పసిడి పతకాలతో మెరిశారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్‌ (తజికిస్థాన్‌)ను చిత్తుగా చేయగా..70 కేజీల తుదిపోరులో ఆకాన్ష అంతే తేడాతో తైమజోవా (రష్యా)ను ఓడించింది. 48 కేజీల పసిడి సమరంలో హెజిన్‌ (అర్మేనియా)పై పాయల్‌ విజయం సాధించింది. సాహిల్‌ (75 కేజీ), హేమంత్‌ (80 కేజీల పైన), జతిన్‌ (54 కేజీ) విని (57 కేజీ), సృష్టి (63 కేజీ), మేఘ (80 కేజీ) తుది పోరులో ఓడి రజతాలతో సంతృప్తి పడ్డారు. 17 పతకాలతో (3 స్వర్ణ, 9 రజత, 5 కాంస్యాలు) భారత్‌ రెండో స్థానంతో టోర్నీని ముగించింది. రష్యా (7 స్వర్ణ, 3 రజత, 7 కాంస్యాలు) అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z